చర్లలోని డయాలసిస్ సెంటర్ ఏర్పాటు

BDK: చర్ల మండల కేంద్రంలోని CHCలో డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఐదు మిషన్ల ద్వారా దాదాపు 40 మందికి డయాలసిస్ సేవలు అందించవచ్చు. గతంలో డయాలసిస్ చేయించుకోవడం కోసం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఏటూరు నాగారం, భద్రాచలం ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చేది. చర్ల సీహెచ్‌సీలో డయాలసిస్ సేవలు అందుబాటులోకి రావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.