రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు అప్పన్నపేట విద్యార్థిని ఎంపిక

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు అప్పన్నపేట విద్యార్థిని ఎంపిక

పెద్దపల్లి మండలం ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి జూనియర్స్ ఖోఖో పోటీలకు అప్పన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థిని పంబాల అశ్విత ఎంపికయ్యారు. ఈనెల 28-30 వరకు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్స్ ఖోఖో ఛాంపియన్ షిప్ పోటీలకు అస్మిత ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సురేందర్ తెలిపారు.