బీసీ సెల్ అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి

SKLM: సంతబొమ్మాళి మండలం బీసీ సెల్ అధ్యక్షుడిగా గోవిందాపురం పంచాయతీ సీనియర్ వైసీపీ నాయకుడు ప్రసాద్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ నుంచి ఉత్తర్వులందాయని ఆయన తెలిపారు. తనపై నమ్మకంతో అప్పచెప్పిన బాధ్యత నెరవేరుస్తానని ఆయన అన్నారు. నియామకానికి కృషి చేసిన టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ తిలక్‌కు అభినందనలు తెలిపారు.