వెంకన్న దేవస్థానం ఛైర్మన్‌గా కంచిపల్లి

వెంకన్న దేవస్థానం ఛైర్మన్‌గా కంచిపల్లి

కోనసీమ: అమలాపురం పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఛైర్మన్‌గా జనసేన సీనియర్ నాయకులు కంచిపల్లి అబ్బులును అధిష్టానం నియమించింది. అబ్బులు గతంలో ఇదే దేవస్థానానికి ఛైర్మన్‌గా పనిచేశారు. అబ్బులు నియామకం పట్ల అమలాపురానికి చెందిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.