'బండి రవికుమార్ కుటుంబానికి అండగా ఉంటాం'

'బండి రవికుమార్ కుటుంబానికి అండగా ఉంటాం'

KDP: మైదుకూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం వీరాభిమాని బండి రవికుమార్ కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. బండి రవికుమార్‌ను వారి స్వగృహంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కలిసి ఆప్యాయంగా పలకరించారు. బండి రవికుమార్‌కు తొందరలోనే పెన్షన్ వచ్చేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా అధికారులకు ఫోన్ ద్వారా వివరాలు తెలియజేశారు.