'కొనుగోలు కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలి'
SRCL: జిల్లాలోని పంట ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పించాలని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని మెప్మా ఆధ్వర్యంలో ముష్టిపల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆమె మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంత వరకు ఎంత ధాన్యం వచ్చింది? ఎంత కొనుగోలు చేశారో అని వివరాలు ఆరా తీశారు.