చిట్యాలలో జ్యోతిరావు పూలే విగ్రహానికి నేతల నివాళి
NLG: జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా... చిట్యాలలోని శ్రీ కనకదుర్గమ్మ గుడి సెంటర్‌లో గల వారి విగ్రహానికి నేతలు ఇవాళ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాసు, మాజీ కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు హాజరై నివాళులు అర్పించారు. పూలే సేవలను కొనియాడారు.