చోరీకి గురైన ఆభరణాలు స్వాధీనం.. ఒకరు అరెస్ట్

చోరీకి గురైన ఆభరణాలు స్వాధీనం.. ఒకరు అరెస్ట్

ప్రకాశం: పీసీపల్లి(మం) బండపాలెం ఏనుగంటి వెంగమ్మ ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడు కాళహస్తి శివశంకర్‌ను శనివారం కనిగిరిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి నల్లపూసలపాడు, 2 ఉంగరాలు, రెండు జతల వెండి పట్టీలు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ పీ. సాయి ఈశ్వర్ యశ్వంత్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మిగిలిన నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.