వెలిశాలలో ఘనంగా 'ప్రజా పాలన' కార్యక్రమం
SRPT: తిరుమలగిరి(M) వెలిశాలలో సర్పంచ్ కుంభం మంజుల సతీష్ అధ్యక్షతన ప్రజాపాలన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.