రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు: పౌరసరఫరాల శాఖ

రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు: పౌరసరఫరాల శాఖ

TG: రాష్ట్రంలో గ్యాస్ కొరత లేకుండా పౌరసరఫరాల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. సిలిండర్ల పంపిణీలో ఎక్కడా నిర్లక్ష్యం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 2,42,371 సిలిండర్లను వినియోగదారులకు పంపిణీ చేసినట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. కేవలం వాణిజ్య సిలిండర్లకు మాత్రమే స్వల్ప కొరత ఉందని స్పష్టం చేసింది.