రైస్ మిల్లును ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
SRCL:వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లిలోని మహాలక్షీ రైస్ మిల్లులో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లుకు వచ్చిన లారీలు, ధాన్యం నిల్వలు పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే లారీలను ఎప్పటికప్పుడు దించుకోవాలని, ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.