OTTలోకి ఫ్రీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన 'బాఘీ 4'
బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న థ్రిల్లర్ ఫ్రాంఛైజీ 'బాఘీ'. ఈ సిరీస్ నుంచి ఇటీవల వచ్చిన 'బాఘీ 4' అనుకున్నంత స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో రెంటెడ్ విధానంలో అందుబాటులో ఉన్న ఈ సినిమా.. తాజాగా ఫ్రీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. దీంతో అమెజాన్ సబ్‌స్క్రైబర్‌లు ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండా దీన్ని చూడొచ్చు.