నూతన పాఠశాల భవనాన్ని నిర్మిస్తాం: మంత్రి
KRNL: సంజామల మండల పరిధిలోని ముదిగేడు ఎంపీపీ పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలోనికి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వర్షపునీరు చేరాయి. ఈ నేపథ్యంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గురువారం పాఠశాలలను పరిశీలించారు. త్వరలో నూతన భవనాలను నిర్మిస్తామని, అప్పటివరకు వేరే భవనాలలో క్లాసులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో సాల్మన్, R&B అధికారులను ఆదేశించారు.