VIDEO: మంత్రి చేతుల మీదుగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
W.G: పాలకొల్లులోని BRMVM మున్సిపల్ హైస్కూల్లో నిన్న సీసీఎల్ ప్రోడక్ట్స్, సీఎస్ఆర్ నిధుల సహాయంతో మంత్రి రామానాయుడు ఆధ్వర్యంలో 9వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. మూడో విడతలో భాగంగా పట్టణంలోని 6 పాఠశాలలకు చెందిన 264 మంది విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ సైకిళ్లను అందించారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా ఒక విద్యార్థిని సైకిల్ ఎక్కించుకొని తొక్కి చూపించారు.