'మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి'
ELR: మహిళలు అన్నిరంగాలలో రాణించి సమాజాభివృద్ధికి కృషి చేయాలని MLC బొర్రా గోపి మూర్తి అన్నారు. బుధవారం ఉంగుటూరు(M) నారాయణపురం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. సమావేశానికి కత్తుల ఝాన్సీ రాణి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా పది మంది మహిళా ఉపాధ్యాయులను ఎమ్మెల్సీ గోపి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.