జాతీయ రహదారిపై మరమ్మతు పనులు
SKLM: చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై మకరజోల, హరిపురం మధ్య రోడ్ మరమ్మతు పనులు చేపట్టారు. ఇటీవల వర్షాల కారణంగా రహదారి పలుచోట్ల దెబ్బతిని వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల ఆదేశాలతో సిబ్బంది మరమ్మతులు చేపట్టడంతో దూర ప్రాంతాలకు ప్రయాణించే వాహనదారులు, స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.