రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే
NGKL: రైతులు పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేట పట్టణంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ పంటను మధ్యవర్తుల వద్ద అమ్మకుండా, ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని సూచించారు.