13న వికలాంగుల డైరెక్టర్ ముట్టడి

13న వికలాంగుల డైరెక్టర్ ముట్టడి

SRD: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్‌లోని వికలాంగుల డైరెక్టర్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కార్యదర్శి అడివయ్య కోరారు. సంగారెడ్డిలో శనివారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముట్టడికి వికలాంగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.