VIDEO: రాజక్కపేటలో రాత్రిపూట చోరీలు
SDPT: దుబ్బాక మండలం రాజక్కపేటలో రాత్రి వేళ దొంగతనాలు పెరుగుతున్నాయి. ఇంటి బయట ఉన్న లైట్లు, చెప్పులను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్తున్నారు. గత నెల రోజులుగా వరుసగా జరుగుతున్న ఈ ఘటనలకు గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయానికి లైట్లు, చెప్పులు మాయం అవుతున్నాయని స్థానికులు తెలిపారు. సోమవారం గ్రామంలో సుమారు 30 ఎల్ఈడీ లైట్లు మాయం చేశారు.