'అనగనగా ఒకరాజు' ఫస్ట్ సింగిల్‌కు టైం ఫిక్స్
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తోన్న మూవీ 'అనగనగా ఒకరాజు'. తాజాగా ఈ సినిమాలోని ఫస్ సింగిల్ 'భీమవరం బల్మా'పై అప్‌డేట్ వచ్చింది. భీమవరంలోని SRKR ఇంజినీరింగ్ కాలేజీలో ఈ పాట లాంచ్ ఈవెంట్ రేపు సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ కానుంది. ఇక కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ 2026 JAN 14న విడుదల కానుంది.