భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని వినతి
CTR: పుంగనూరు రాతి మసీదు భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని మసీదు కమిటీ గౌరవ అధ్యక్షుడు బాబా ఫక్రుద్దీన్, సెక్రటరీ సద్దాం హుస్సేన్ కోరారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్‌ని నెల్లూరులోని ఆయన నివాసంలో కలిశారు. రాతి మసీదుకు సంబంధించిన దాదాపు 350 ఎకరాలు భూమి వక్ఫ్ బోర్డ్ ఆధీనంలో ఉన్నట్లు చెప్పారు. భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు.