SIR ప్రక్రియ.. ఈసీ నోటిఫికేషన్
దేశంలోని 23 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(CEC) సిద్ధమైంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలో నకిలీ ఓట్లు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో నకిలీ ఓటర్లను తొలగించి, ఓటర్ల లిస్టును ప్రక్షాళన చేసేందుకు EC ఈ ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే TG సహా 22 రాష్ట్రాల్లో SIRకు నోటిఫికేషన్ జారీ అయింది.