ఈనెల 6న రింతాడలో రక్తదాన శిబిరం

ఈనెల 6న రింతాడలో రక్తదాన శిబిరం

ASR: డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈనెల 6న జీకేవీధి మండలం రింతాడ పంచాయతీలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఉప సర్పంచ్ సోమేష్ కుమార్ తెలిపారు. సోమవారం పెసా కమిటీ కార్యదర్శి రాజేష్ కుమార్ తదితరులతో చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రాను కలిశారు. శిబిరం పోస్టర్‌లు ఆవిష్కరించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు.