VIDEO: అన్నవరం ఆలయంలో ముగిసిన శ్రీరామనవమి వేడుకలు
కాకినాడ: ప్రముఖ పుణ్య క్షేత్రం అన్నవరంలో శ్రీరామనవమి ఉత్సవాలు గురువారం చక్రస్నానంతో వైభవంగా ముగిశాయి. ఆలయ ఈవో త్రినాధరావు, ఛైర్మన్ ఐ.వి. రోహిత్ ఆధ్వర్యంలో వేద పండితులు స్వామి, అమ్మవార్లకు శాస్త్రోక్తంగా చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకను కళ్లారా చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీనితో ఆలయంలో సాగుతున్న నవమి వేడుకలు ఘనంగా ముగిశాయి.