కల తెచ్చిన కష్టం.. ఏడేళ్లకు ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగికి విముక్తి
వింత కల ఓ వ్యక్తి జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. తనపై అత్యాచారం జరగలేదని, అదంతా కలలోని భ్రమ అని బాధితురాలు కోర్టులో వెల్లడించడంతో ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి అనురాగ్ నిర్దోషిగా విడుదలయ్యారు. 2019లో నమోదైన ఈ తప్పుడు కేసు వల్ల ఆయన 19 రోజులు జైలులో గడపడమే కాకుండా, కెరీర్‌లో రావాల్సిన ప్రమోషన్‌ను కోల్పోయారు. ఏడేళ్ల పోరాటం తర్వాత న్యాయస్థానం ఆయనను విముక్తుడిని చేసింది.