కనేకల్‌లో RTC బస్సులు కరువు
ATP: కనేకల్‌లో RTC బస్సులు దాదాపు నిలిచిపోయాయి. ఒకప్పుడు అనంతపురం, బళ్లారి, కళ్యాణదుర్గం వంటి రూట్లకు రెగ్యులర్ బస్సులు నడిచినా.. 2025 నాటికి పూర్తిగా తగ్గిపోయాయి. డిపో అధికారులు “ప్యాసింజర్లు లేకపోవడం, కలెక్షన్ రాకపోవడం” కారణమని తెలిపారు. ప్రజలు ఇప్పుడు కనేకల్ క్రాస్, ఉరవకొండ వెళ్లి ఇతర బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.