VIDEO: ఎంవీపీ కాలనీ అప్పుఘర్‌లో అగ్నిప్రమాదం

VIDEO: ఎంవీపీ కాలనీ అప్పుఘర్‌లో అగ్నిప్రమాదం

VSP: విశాఖపట్నం ఎంవీపీ కాలనీ అప్పుఘర్‌లో విద్యుత్ సరఫరా లేక చీకట్లో కొవ్వొత్తి వెలిగించగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇంట్లోని ఫర్నిచర్, గృహోపకరణాలు, కొంత నగదు దగ్ధమయ్యాయి. సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇంట్లో ఉన్నవారు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.