నేడు సదరం స్లాట్ బుకింగ్ ఓపెన్

నేడు సదరం స్లాట్ బుకింగ్ ఓపెన్

వరంగల్: సదరం వైద్య పరీక్షల కోసం ఈనెల 2వ తేదీ నుంచి స్లాట్లు అందుబాటులో ఉంటాయని హనుమకొండ డీఆర్‌డీవో కె.నాగపద్మజ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి మీసేవ కేంద్రాల ద్వారా స్లాట్స్‌ బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారికి ఈ నెల 6,15,21,22,23 తేదీల్లో ఎంజీఎం నందు, 20,21 తేదీల్లో ప్రాంతీయ కంటి వైద్యశాలలో పరీక్షలు నిర్వహిస్తారన్నారు.