రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కృష్ణా: బాపులపాడు జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు.. గురజాడకు చెందిన మన్నెం సురేష్(31) కొంతకాలం నుంచి బాపులపాడులో నివాసం ఉంటూ, అల్యూమినియం పరికరాల తయారీ పనిచేస్తున్నాడు. గురువారం ద్విచక్ర వాహనంపై ఆరుగొలను వైపు నుంచి జంక్షన్ వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్సై వి. సురేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.