VIDEO: ఘనంగా పెద్దమ్మ పండుగ
SRCL: తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్‌లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా పెద్దమ్మ పండుగ నిర్వహించారు. ముదిరాజ్ సంఘం సభ్యులు పెద్దమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం పోచమ్మ బోనాలతో ప్రారంభమైన పెద్దమ్మ పండుగ నేటితో ముగుస్తుందని ముదిరాజ్ సంఘం సభ్యులు తెలిపారు. పెద్ద ఎత్తున ముదిరాజ్ సంఘ సభ్యులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.