కార్యకర్తలకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే
BDK: కరకగూడెం మండలం రఘునాథపాలెం గ్రామంలో కొద్దిరోజుల క్రితం ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సోలం సత్యం అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారిని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ పరామర్శించారు. ముందుగా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైనప్పుడు పార్టీ తరఫున పూర్తి సహకారం ఉంటుందన్నారు.