VIDEO: కొట్టుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు
TG: నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలో నిన్న అర్ధరాత్రి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. కొర్లపహాడ్‌లో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా దాడి చేశారు. రాళ్లు, కత్తులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో నలుగురు బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు.