గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌లో కుండపోత వర్షం

గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌లో కుండపోత వర్షం

SDPT: గజ్వేల్ నియోజకవర్గం ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో గంటకు పైగా కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి కుంటలు, కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయి. మ్యాన్ హోల్స్, మోరీలు వరద నీటితో నిండిపోయాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ముఖ్యంగా చిన్నపిల్లలను ఇంట్లోనే ఉంచాలని అధికారులు సూచించారు.