ఆలయాల అభివృద్ధికి భారీ విరాళం

ఆలయాల అభివృద్ధికి భారీ విరాళం

RR: చేవెళ్ల మండలంలోని నాంచెరి గ్రామంలో ఉన్న మల్లన్న, బీరప్ప గుడి అభివృద్ధి కోసం డాక్టర్ వైభవ్ రెడ్డి తన వంతుగా రూ. 50వేలను విరాళంగా ఆ గ్రామ సర్పంచ్ అశోక్‌కు అందజేశారు. అలాగే కొత్తపల్లి గ్రామంలోని ఈదమ్మ గుడి నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల కోసం మరో రూ. 50వేలను విరాళంగా బీజేపీ నాయకులు ప్రకాశ్ గౌడ్‌కి అందించి తన సేవాభావాన్ని చాటుకున్నారు.