పోతంగల్‌లో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం
NZB: పోతంగల్ మండల కేంద్రంలో శనివారం యూత్ కాంగ్రెస్ అవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జెండాను అవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పడు సామాజిక సేవా చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రధాన సంస్థగా యూత్ కాంగ్రెస్ స్థాపించారని గుర్తు చేశారు. ఇందులో మండల యూత్ కాంగ్రెస్ సభ్యులు పాల్గొన్నారు.