పాచిపెంటలో NTR వర్ధంతి

పాచిపెంటలో NTR వర్ధంతి

PPM: పాచిపెంట మండల టీడీపీ అధ్యక్షులు గుడెపు యుగంధర్ ఆధ్వర్యంలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. సోమవారం పాచిపెంట పాత బస్ స్టాండ్ ఆవరణలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూల వేసి నివాళులర్పించారు. పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుందని అన్నారు. అనంతరం పలువురికి చీరలు, రగ్గులు అందజేశారు.