'మాధవ్ పర్యటన విజయవంతం చేయండి'

కోనసీమ: ముమ్మిడివరం నియోజకవర్గ బీజేపీ సమావేశం అసెంబ్లీ కన్వీనర్ గోలకోటి వెంకటరెడ్డి అధ్యక్షతన చెయ్యేరు మండలం గున్నేపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కర్రి చిట్టిబాబు పాల్గొని, మాట్లాడారు. ఈనెల 25న రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ అమలాపురం పర్యటన సందర్భంగా అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరుకావాలని సూచించారు.