సెప్టెంబర్ 23.. ఆయుర్వేద దినోత్సవం

సెప్టెంబర్ 23వ తేదీని ఆయుర్వేద దినోత్సవంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. `ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్`అన్న ఇతివృత్తాన్ని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆయుర్వేదం కేవలం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మాత్రమే కాదని, ఇది వ్యక్తికి, పర్యావరణానికి మధ్య సామరస్యం అనే సూత్రంలో పాతుకుపోయిన జీవన శాస్త్రమని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ అన్నారు.