టెక్నాలజీ ప్రభావం.. కష్టాల్లో నాయి బ్రాహ్మణులు..!

టెక్నాలజీ ప్రభావం.. కష్టాల్లో నాయి బ్రాహ్మణులు..!

MDK: టెక్నాలజీ ప్రభావంతో పల్లె జీవన విధానంలో మార్పులు వచ్చినప్పటికీ సంప్రదాయ కులవృత్తులు కష్టకాలంలో కొనసాగుతున్నాయని నాయి బ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేశారు. రేగోడ్ మండలం చౌదర్‌పల్లికి చెందిన ప్రభాకర్ శనివారం మాట్లాడుతూ.. ఆదరణ తగ్గి నష్టాలతో జీవనం సాగిస్తున్నామన్నారు. తక్కువ ఆదాయంతో కుటుంబాన్ని పోషించడం భారంగా మారిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.