డీఈవో జ్ఞానేశ్వర్‌పై ఉపాద్యాయుల ఆగ్రహం

డీఈవో జ్ఞానేశ్వర్‌పై ఉపాద్యాయుల ఆగ్రహం

వరంగల్ డీఈవో జ్ఞానేశ్వర్ ఎంఈవోల సమావేశంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక ప్రధానోపాధ్యాయుడిని దూషించడం పట్ల వరంగల్ జిల్లా ఉపాధ్యాయ సంఘాలు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఉపాధ్యాయులు రోడ్లపైకి వచ్చి డిఈవో జ్ఞానేశ్వర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయడంతో పాటు మంత్రి కొండా సురేఖ ఎంపీ కడియం కావ్య పలువురు ఎమ్మెల్యేలకు మెమోరాండంలను సమర్పించారు.