లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: SI
WGL: జిల్లా కోర్టులో ఈ నెల 15న జరగనున్న లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సంగెం మండల SI వంశీకృష్ణ కక్షిదారులను కోరారు. ఇవాళ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. భూ వివాదాలు, చీటింగ్, చిన్న యాక్సిడెంట్ కేసులను సామరస్యంగా మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించారు. రాజీమార్గమే రాజా మార్గమని అన్నారు. రాజీ కుదిరిన కేసులు కోర్టు నుంచి తొలగించబడతాయని తెలిపారు.