VIDEO: సిద్దేశ్వర ఆలయంలో లక్ష బిల్వార్చన మహోత్సవం
SRD: కంగ్టి మండల కేంద్రంలోని శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో సోమవారం లక్ష బిల్వార్చన ప్రత్యేక మహోత్సవం నిర్వహించారు. మోక్షద ఏకాదశి, శివుడికి ప్రత్యేక వారంగా పురస్కరించుకొని మండలంలోని చౌకన్ పల్లి గ్రామానికి చెందిన నాగయ్య స్వామి ఆధ్వర్యంలో సిద్దేశ్వర స్వామికి బిల్వపత్రాలతో అర్చనలు చేశారు. అర్చకులు శివకుమార్ స్వామి తీర్థప్రసాదాలు వితరణ చేశారు.