పెట్రోల్ బంకుల్లో భారీ క్యూ లైన్
HYD: పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే ప్రచారంతో నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ నెలకొంది. వాహనదారులు ముందస్తుగా ఫ్యూయెల్ నింపుకునేందుకు క్యూ కట్టారు. అయితే, ఇంధన సరఫరా సాధారణంగానే ఉందని, ఎలాంటి కొరత లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే అపోహలను నమ్మవద్దని, అనవసరంగా ఆందోళన చెందవద్దని ప్రజలను కోరుతున్నారు.