పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

SKLM: కోటబొమ్మాళి మండలం యలమంచిలి గ్రామానికి చెందిన బంధాపు ఆనందరావు పురుగుల మందు తాగి మృతి చెందాడు. మద్యం తాగొద్దని ఆనందరావు భార్య తేజావతి మందలించడంతో గొడవ పడి పురుగుల మందు తాగాడు. హుటాహుటీన స్థానిక అసుప్రతికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వైద్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.