మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ

కృష్ణా: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మచిలీపట్నం 27 డివిజన్ వైసీపీ ఇన్‌ఛార్జ్ షేక్ అచ్చేబా ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చేబా మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.