తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డికి అనుమతి

తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డికి అనుమతి

ATP: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. గత 10 నెలలుగా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వడం లేదని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.