'యువభారతం నవ భారతాన్ని నిర్మించాలి'
VSP: యువభారతం నవ భారతాన్ని నిర్మించే దిశగా కృషి చేయాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి. పి. రాజశేఖర్ అన్నారు. శనివారం ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయం సోషల్ వర్క్ విభాగంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ... రానున్న దశాబ్దాలు భారతీయ యువతవేనని అన్నారు.