గుత్తి కోట మహా అద్భుతం: జిల్లా కలెక్టర్

గుత్తి కోట మహా అద్భుతం: జిల్లా కలెక్టర్

ATP: గుత్తి కోటను జిల్లా కలెక్టర్ ఆనంద్ కుటుంబ సమేతంగా ఆదివారం సందర్శించారు. కోట కింద భాగంలోని ఆంగ్లేయుల సమాధులను పరిశీలించారు. అనంతరం కొండ ఎక్కి కోటలోని గుర్రపు, ఏనుగు శాలలు, చీకటి గదులు, బావులు, దేవాలయాలను సందర్శించారు. కోట యొక్క చరిత్రను గైడ్‌ని అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా, తహశీల్దార్ పుణ్యవతి, పాల్గొన్నారు.