యాభై ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడి చెంతకు
సుమారు 50 ఏళ్ల తర్వాత మనిషి మళ్లీ చంద్రుడి దగ్గరకు వెళ్తున్న 'ఆర్టెమిస్-2' మిషన్‌లో క్రిస్టినా కోచ్ భాగం కానున్నారు. లో-ఎర్త్ ఆర్బిట్ దాటి ప్రయాణించే మొదటి మహిళగా ఆమె చరిత్ర సృష్టించబోతున్నారు. చిన్నప్పుడు నక్షత్రాలను చూసి కలలు కన్న ఆ చిన్నారి, ఇప్పుడు వెన్నెల కురిపించే జాబిల్లి చెంతకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ ప్రయాణం భవిష్యత్ మహిళా వ్యోమగాములకు స్ఫూర్తిగా నిలవనుంది.