షార్ట్ సర్క్యూట్.. ఇల్లు దగ్ధం

ఎన్టీఆర్: గంపలగూడెం మండలం సొబ్బల గ్రామంలో సోమవారం తెల్లవారు జామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఓ ఇల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో శ్రీను కుటుంబం సురక్షితంగా బయటపడింది. ఇంట్లోని విలువైన నగదు, వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానిక ప్రజలు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.